మహాముత్తారం మండలంలోని స్తంభంపల్లి గ్రామంలో ఈరోజు కాంగ్రెస్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో మండలం అధ్యక్షులు జాడి రాజయ్య గారికి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది, ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ మా మిత్రులు రాజయ్య మండల స్థాయిలో,జిల్లా స్థాయిలో ఒక బలమైన నేతగా ఎదగడం ద్వారా మా ఊరికి గర్వకారణం అని తెలిపారు అలాగే ఇంకా ముందు ముందు మంచి స్థాయిలో ఉండాలని మా యొక్క గ్రామం అభివృద్ధి కి సహాయ సహకారాలు అందించాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జాడి శ్రీకాంత్, వార్డ్ మెంబర్ రాజమ్మ, మాజీ గ్రామాశాఖ అధ్యక్షులు జంగిడి రాజేష్, యూత్ నాయకులు పసుల రామ్, పసుల సారయ్య, జాడి లింగమూర్తి తదితరులు పాల్గొన్నారు.



