*23 మందికి రూ.2.30 లక్షల జరిమానా – ట్రాఫిక్ అంతరాయానికి మరో 5 మందికి జరిమానా.*
*మద్యం సేవించి వాహనాలు నడిపే వారిపై ఎలాంటి మినహాయింపు లేకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిక.*
– రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా తిరుపతి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
– మద్యం సేవించి వాహనాలు నడిపిన 23 మందిపై కేసులు నమోదు.
– 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.2,30,000/- జరిమానా.
– ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 5 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున మొత్తం రూ.1,500/- జరిమానా.
– తిరుపతి నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిరంతరం కొనసాగింపు.
తిరుపతి, సెప్టెంబర్ 07, పున్నమి ప్రతినిధి
రోడ్డు ప్రమాదాలను తగ్గించడం, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై క్రమశిక్షణ పెంపొందించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే వారిని నియంత్రించడంలో భాగంగా తిరుపతి ట్రాఫిక్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తిరుపతి *జిల్లా ఎస్పీ శ్రీ ఎల్. సుబ్బరాయుడు, ఐపీఎస్.,* ఆదేశాల మేరకు, తిరుపతి ట్రాఫిక్ డీఎస్పీ శ్రీ కొండయ్య ,పర్యవేక్షణలో 07.09.2026న తిరుపతి ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో విస్తృత వాహన తనిఖీలు చేపట్టారు.
ఈ తనిఖీలలో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 23 మందిపై డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు, ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 5 మందిపై కేసులు నమోదు చేశారు.
నమోదైన కేసులపై గౌరవ 1వ స్పెషల్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు, తిరుపతిలో విచారణ జరగగా, డ్రంక్ అండ్ డ్రైవ్‌కు పాల్పడిన 23 మందికి ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున మొత్తం రూ.2,30,000/- జరిమానా విధించారు. అలాగే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించిన 5 మందికి ఒక్కొక్కరికి రూ.300 చొప్పున మొత్తం రూ.1,500/- జరిమానా విధించారు.
మద్యం సేవించి వాహనం నడపడం వల్ల వాహనదారుడితో పాటు రహదారిపై ప్రయాణించే ఇతరుల ప్రాణాలకు కూడా తీవ్ర ప్రమాదం ఏర్పడే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. మద్యం సేవించి వాహనం నడపవద్దని, ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని వాహనదారులకు సూచించారు.
రోడ్డు ప్రమాదాల నివారణ, ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని తిరుపతి ట్రాఫిక్ డిఎస్పి ఆధ్వర్యంలో ట్రాఫిక్ సిఐ , వారి సిబ్బంది తిరుపతి నగరంలో ట్రాఫిక్ పోలీసులు ప్రస్తుతం కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలను నిరంతరం కొనసాగిస్తున్నారు.



