తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలో రహదారి భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ట్రాక్టర్ ట్రాలీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెనుక వైపు రిఫ్లెక్టివ్ (రేడియం) స్టిక్కర్లు లేని ఐదు ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి సీజ్ చేశారు. నిబంధనల మేరకు వాహనాలకు జరిమానాలు విధించారు.
రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలకు ట్రాక్టర్ ట్రాలీలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్ఐ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ప్రతి ట్రాక్టర్ ట్రాలీకి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, అవసరమైన లైట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

చిట్వేల్‌లో ట్రాక్టర్ ట్రాలీలపై ప్రత్యేక తనిఖీలు.. ఐదు వాహనాలు సీజ్
తిరుపతి జిల్లా, రైల్వేకోడూరు నియోజకవర్గం, చిట్వేల్ మండల పరిధిలో రహదారి భద్రతపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. సోమవారం నిర్వహించిన ప్రత్యేక తనిఖీల్లో ట్రాక్టర్ ట్రాలీలను క్షుణ్ణంగా పరిశీలించారు. వెనుక వైపు రిఫ్లెక్టివ్ (రేడియం) స్టిక్కర్లు లేని ఐదు ట్రాక్టర్ ట్రాలీలను గుర్తించి సీజ్ చేశారు. నిబంధనల మేరకు వాహనాలకు జరిమానాలు విధించారు. రాత్రి వేళల్లో రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు లేకపోవడం వల్ల వెనుక నుంచి వచ్చే వాహనాలకు ట్రాక్టర్ ట్రాలీలు కనిపించక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ఎస్ఐ వినోద్‌కుమార్ హెచ్చరించారు. ప్రతి ట్రాక్టర్ ట్రాలీకి రిఫ్లెక్టివ్ స్టిక్కర్లు, అవసరమైన లైట్లు తప్పనిసరిగా ఉండాలని సూచించారు. రహదారి భద్రత నిబంధనలు ఉల్లంఘించే వాహనాలపై ఇకపై కూడా కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.

