కూసుమంచి/ ఖమ్మం
ఖమ్మం కేబుల్ బ్రిడ్జికి స్వర్గీయ వనజీవి రామయ్య వారధిగా నామకరణం చేయాలని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి, జనసేన పట్టభద్రుల శాసన మండలి అభ్యర్థి డాక్టర్ గడల శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం కూసుమంచిలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముగ్గురు మంత్రుల పెత్తనం తప్ప జిల్లా ప్రజలకు ఒరిగింది ఏమీలేదని విమర్శించారు. ప్రజా సమస్యల పరిష్కారంపై పాలకులు దృష్టి సారించాలని కోరారు. రానున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులంతా తనకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని డాక్టర్ గడల శ్రీనివాస్ విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఖమ్మం అసెంబ్లీ ఇంచార్జి, రాష్ట్ర అధికార ప్రతినిధి మిర్యాల రామకృష్ణ పాల్గొన్నారు.



