నిర్మల్లో 1000కు పైగా బైకులతో భారీ ర్యాలీ
డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు
భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు
నిర్మల్, సెప్టెంబర్ 6:
కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 1000కు పైగా బైకులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో నిర్మల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో విజయోత్సాహం వెల్లివిరిసింది.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు, ముథోల్ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి మండలం నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బీఎల్ఏలు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు.
అలాగే యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సెల్ల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేశారు.
కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు
బైక్ ర్యాలీని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల ఐక్యత, ఉత్సాహం, భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ ఘన విజయాన్ని సాధించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ 1000 రోజుల పాలనకు ఘన విజయోత్సవం
నిర్మల్లో 1000కు పైగా బైకులతో భారీ ర్యాలీ డీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్యే బొజ్జు పటేల్ ఆధ్వర్యంలో ఘనంగా సంబరాలు భారీగా తరలివచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిర్మల్, సెప్టెంబర్ 6: కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం 1000 రోజుల పాలనను పురస్కరించుకుని నిర్మల్ పట్టణంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షులు, నిర్మల్ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్ గారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ర్యాలీలో 1000కు పైగా బైకులతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. దీంతో నిర్మల్లో కాంగ్రెస్ శ్రేణుల్లో విజయోత్సాహం వెల్లివిరిసింది. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్ శ్రీహరి రావు, ముథోల్ నియోజకవర్గ ఇంచార్జ్ నారాయణ్ రావు పటేల్, మాజీ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్లు, మాజీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నిర్మల్ నియోజకవర్గ పరిధిలోని పట్టణ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రతి మండలం నుంచి మండల కాంగ్రెస్ అధ్యక్షులు, మండల కమిటీ సభ్యులు, జిల్లా కార్యవర్గ సభ్యులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, లైబ్రరీ చైర్మన్లు, మార్కెట్ కమిటీ చైర్మన్లు, ఆత్మ చైర్మన్లు, ఆలయ చైర్మన్లు, సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులు, బీఎల్ఏలు తదితరులు ర్యాలీలో పాల్గొన్నారు. అలాగే యువజన కాంగ్రెస్, మహిళా కాంగ్రెస్, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ సెల్ల నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల ప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ర్యాలీని విజయవంతం చేశారు. కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు బైక్ ర్యాలీని విజయవంతం చేసేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి, కార్యక్రమాన్ని విజయవంతం చేసిన కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. కార్యకర్తల ఐక్యత, ఉత్సాహం, భారీగా తరలివచ్చిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలతో ర్యాలీ ఘన విజయాన్ని సాధించిందని కాంగ్రెస్ నాయకులు పేర్కొన్నారు.

