కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 6 :
ఘనంగా సత్కరించిన ముసిరెడ్డి నాగేశ్వరరావు
కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరుదైన ఘనత సాధించారు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు.
కె. లావరాజు – బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ :* 2005లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థ నుండి కరాటే శిక్షణ ప్రారంభించి, 2008లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్, 2017లో రెండవ డాన్, 2026లో ప్రతిష్టాత్మక మూడవ డాన్ సాధించాడు. ప్రస్తుతం ఎంతోమందికి కరాటే శిక్షణ ఇస్తూ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ అందిస్తున్నాడు.
వై. శ్రీను – బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ :* 2008లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థలో కరాటే శిక్షణ ప్రారంభించి, 2017లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ సాధించాడు. ప్రైవేట్ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఉచితంగా ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తూ సేవ చేస్తున్నాడు.వీరిద్దరినీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూకాట్రావులపల్లి గ్రామం నుండి ఇద్దరు యువకులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం మనందరికీ గర్వకారణం.
– లావరాజు, శ్రీను చిన్న వయసు నుండే కరాటే పై మక్కువతో సాధన చేసి బ్లాక్ బెల్టులు సాధించి నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఆత్మరక్షణ నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపడం అభినందనీయం.ఇలాంటి యువకులను కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. వీరు మరిన్ని రికార్డులు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలి.

గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించిన కరాటే యోధులు మన కాట్రావులపల్లి యువకుల అరుదైన ఘనత
కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి, సెప్టెంబర్ 6 : ఘనంగా సత్కరించిన ముసిరెడ్డి నాగేశ్వరరావు కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం కాట్రావులపల్లి గ్రామానికి చెందిన ఇద్దరు యువకులు అరుదైన ఘనత సాధించారు. గిన్నిస్ ప్రపంచ రికార్డు సొంతం చేసుకుని గ్రామానికి, మండలానికి గర్వకారణంగా నిలిచారు. కె. లావరాజు – బ్లాక్ బెల్ట్ మూడవ డాన్ :* 2005లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థ నుండి కరాటే శిక్షణ ప్రారంభించి, 2008లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్, 2017లో రెండవ డాన్, 2026లో ప్రతిష్టాత్మక మూడవ డాన్ సాధించాడు. ప్రస్తుతం ఎంతోమందికి కరాటే శిక్షణ ఇస్తూ, ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఆడపిల్లలకు ఆత్మరక్షణ శిక్షణ అందిస్తున్నాడు. వై. శ్రీను – బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ :* 2008లో ఒకే నవ మార్షల్ ఆర్ట్స్ సంస్థలో కరాటే శిక్షణ ప్రారంభించి, 2017లో బ్లాక్ బెల్ట్ మొదటి డాన్ సాధించాడు. ప్రైవేట్ పాఠశాలలకే పరిమితం కాకుండా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఉచితంగా ఆత్మరక్షణ తరగతులు నిర్వహిస్తూ సేవ చేస్తున్నాడు.వీరిద్దరినీ గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ముసిరెడ్డి నాగేశ్వరరావు ఘనంగా సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా ముసిరెడ్డి నాగేశ్వరరావు మాట్లాడుతూకాట్రావులపల్లి గ్రామం నుండి ఇద్దరు యువకులు గిన్నిస్ ప్రపంచ రికార్డు సాధించడం మనందరికీ గర్వకారణం. – లావరాజు, శ్రీను చిన్న వయసు నుండే కరాటే పై మక్కువతో సాధన చేసి బ్లాక్ బెల్టులు సాధించి నేడు ఎంతోమందికి ఆదర్శంగా నిలిచారు.ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లోని ఆడపిల్లలకు ఆత్మరక్షణ నేర్పిస్తూ వారిలో ఆత్మవిశ్వాసం నింపడం అభినందనీయం.ఇలాంటి యువకులను కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుంది. వీరు మరిన్ని రికార్డులు సాధించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలి.

