*సమాజంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయం*
* *టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి*
*పున్నమి న్యూస్ రిపోర్టర్ హరికృష్ణ సెప్టెంబర్ 5 కోట మండలం,*
*నెల్లూరు జిల్లా కోట మండలంలోని అల్లా రెడ్డి వెంకటకృష్ణా రెడ్డి జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఉపాధ్యాయుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణన్ విగ్రహానికి పలువురు నాయకులు, ప్రముఖులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో ఉనుగుంటపాలెం పీఏసీఎస్ చైర్మన్, సీనియర్ టీడీపీ నాయకులు నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, రిటైర్డ్ ఉపాధ్యాయుడు ఆవుల సుబ్బయ్య, శ్రీ షిరిడీ సాయి సేవాసమితి చైర్మన్ అల్లం రామయ్య ముఖ్య అతిధులుగా పాల్గొని ఉపాధ్యాయులందరికీ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.సమాజ నిర్మాణంలో, విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ప్రశంసనీయమని వారు పేర్కొన్నారు.అనంతరం దినోత్సవాన్ని పురస్కరించుకుని పాఠశాల ప్రాంగణంలో పలు రకాల మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి దారా మస్తానయ్య, పాఠశాల కమిటీ ఛైర్మన్ హజీర్, పిఈటీ వల్లి అహ్మద్‌తో పాటు పాఠశాల ఉపాధ్యాయులు, ఉపాధ్యాయుణులు, విద్యార్థులు పాల్గొన్నారు.*



