ప్రభుత్వ ఆసుపత్రిలో సర్పంచ్ తనిఖీ
అచ్చంపేట, సెప్టెంబర్ 05(పున్నమి న్యూస్ ప్రతినిధి )నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం లోని
ఉప్పునుంతల మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిని గ్రామ సర్పంచ్ చింతగాళ్ళ శ్రీనివాసులు శనివారం తనిఖీ చేశారు. ఆసుపత్రిలో వైద్యులు సమయపాలన పాటిస్తూ రోగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కోరారు.
ఉదయం వేళల్లో రోగులు అధిక సంఖ్యలో ఆసుపత్రికి వస్తున్నందున అవసరమైన మందుల కొరత లేకుండా చూడాలని సూచించారు. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.
ఈ తనిఖీలో యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మెడమోని భాస్కర్, అంతటి ఇన్‌చార్జి శేఖర్‌గౌడ్, నిరంజన్, బక్కయ్య తదితరులు పాల్గొన్నారు.


