వార్త ముఖ్యాంశాలు
- చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద నారాయణమ్మ స్థాపించిన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
- ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు.
- ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
చిట్వేల్ మండలం తిమ్మాయపాలెం క్రాస్‌రోడ్డు వద్ద నారాయణమ్మ స్థాపించిన శ్రీ దత్తగిరి నారాయణ తపోవన అభయాంజనేయ స్వామి ఆశ్రమంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేపట్టి భక్తిశ్రద్ధలతో వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చుట్టుపక్కల గ్రామాల నుంచి గ్రామస్తులు, భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆశ్రమానికి వచ్చిన భక్తులు ప్రత్యేక పూజల్లో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. జన్మాష్టమి సందర్భంగా ఆశ్రమం వద్ద మధ్యాహ్నం భక్తుల కోసం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. భక్తులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో హాజరై భోజనాలు చేయాలని ఆశ్రమ పీఠాధిపతి నాగేశ్వరమ్మ మరియు ఆశ్రమం పెద్దలు కోరారు. భక్తి వాతావరణంలో వేడుకలు ఉత్సాహంగా సాగాయి.