Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

సూళ్లూరుపేట మేజర్ న్యూస్: చైర్మన్ రేసులో సతీష్ రెడ్డి*

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
సూళ్లూరుపేట మేజర్ న్యూస్: చైర్మన్ రేసులో సతీష్ రెడ్డి*

వార్త ముఖ్యాంశాలు

  • సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఓసి కేటగిరికి దక్కితే టీడీపీ నుండి బరిలోకి దుకాలని వేనాటి సతీష్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
  • తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వేనాటి కుటుంబం పార్టీకి వీర విధేయులుగా నిలిచింది.
  • సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆ కుటుంబం పనిచేస్తూ చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది.

సూళ్లూరుపేట మున్సిపల్ చైర్మన్ పదవి ఓసి కేటగిరికి దక్కితే టీడీపీ నుండి బరిలోకి దుకాలని వేనాటి సతీష్ రెడ్డి రంగం సిద్ధం చేసుకుంటున్నారు.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి వేనాటి కుటుంబం పార్టీకి వీర విధేయులుగా నిలిచింది. సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం ఆ కుటుంబం పనిచేస్తూ చంద్రబాబు నాయుడుతో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తోంది. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నా అధికారంలో ఉన్నా పేటలో టీడీపీ జెండాను జనంలో నిలుపుతున్నారు. ప్రజల్లో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తూ తిరుగులేని శక్తిగా వేనాటి కుటుంబం నిలిచింది. పార్టీని బలోపేతం చేయడానికి నాయకులు కార్యకర్తలు కలుపుకుని పని చేస్తున్నారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల ప్రజల్లో వేనాటి సతీష్ రెడ్డి బలమైన నేతగా నిలిచారు. మంచితనంతో నాయకులు, కార్యకర్తలకు దిశా నిర్దేశం చేస్తూ పేట రాజకీయాల్లో తన మార్కు రాజకీయం చేస్తున్నారు. పేటలో ఎక్కడ విన్న కూటమి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా వేనాటి సతీష్ రెడ్డి పేరు మారుమోగుతోంది. టీడీపీలో రెండు వర్గాలు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో వేనాటి సతీష్ రెడ్డికే టికెట్ దక్కుతుందనే ప్రచారం బలంగా జరుగుతోంది.

*హైలైట్స్:*
– వారిది టీడీపీ విధేయ కుటుంబం
– తండ్రి రాజకీయం సతీష్ కు అదనపు బలం
– చంద్రబాబుకు విధేయుడు
– పేట రాజకీయాల్లో సతీష్ రెడ్డిది ప్రత్యేక శైలి

*PUNNAMI NEWS | Reporter: Kishore |

Leave a comment

Your email address will not be published. Required fields are marked *