Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
తిరుపతి

టౌన్ ప్లానింగ్ అధికారి పై చర్యలు చేపట్టాలి: సీపీఐ నాయకులు సి.వి.ఆర్ కుమార్ డిమాండ్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ: నవీకరణ:
టౌన్ ప్లానింగ్ అధికారి పై చర్యలు చేపట్టాలి: సీపీఐ నాయకులు సి.వి.ఆర్ కుమార్ డిమాండ్

వార్త ముఖ్యాంశాలు

  • గూడూరు 05.10.2026 ( పున్నమి ప్రతినిధి ) : గూడూరు మున్సిపాలిటీ లో అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబు పై చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు సి.వి.ఆర్ కుమార్ తెలిపారు.
  • సోమవారం నాడు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు.
  • ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులు సి .వి.ఆర్ కుమార్ మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్రసన్న రెడ్డి లేఔట్ లో ఓపెన్ స్పేస్ -1 గా చూపించిన భూమి, రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ లో పేర్కొన్న భూమీమధ్య వ్యత్యాసాలపై విచారణ జరపాలన్నారు.

గూడూరు 05.10.2026 ( పున్నమి ప్రతినిధి ) :
గూడూరు మున్సిపాలిటీ లో అవినీతికి పాల్పడుతున్న టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబు పై చర్యలు చేపట్టాలని సీపీఐ నాయకులు సి.వి.ఆర్ కుమార్ తెలిపారు. సోమవారం నాడు గూడూరు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సీపీఐ సీనియర్ నాయకులు సి .వి.ఆర్ కుమార్ మాట్లాడుతూ గూడూరు మున్సిపాలిటీ పరిధిలోని ఎన్ఎస్ఆర్ ప్రసన్న రెడ్డి లేఔట్ లో ఓపెన్ స్పేస్ -1 గా చూపించిన భూమి, రిజిస్టర్ చేసిన గిఫ్ట్ డీడ్ లో పేర్కొన్న భూమీమధ్య వ్యత్యాసాలపై విచారణ జరపాలన్నారు. టౌన్ ప్లానింగ్ అధికారి అవినీతి వల్ల ప్రభుత్వానికి సుమారు 78 లక్షల రూపాయలు నష్టం వాటిల్లిందన్నారు. ప్రభుత్వాన్ని మోసం చేయాలని ముందుగా నిర్ణయించుకుని గూడూరు మున్సిపాలిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ప్రకాష్ బాబు, ఎన్ ఎస్ ఆర్ ప్రసన్నారెడ్డి లేఔట్ యజమానులు నువ్వురు పద్మ ప్రసన్నారెడ్డి కలిసి రికార్డులు తారుమారు చేశారన్నారు. వీరిపై సమగ్ర విచారణ చేసి క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారిని త్వరగతిన అరెస్టు చేయాలన్నారు. అనంతరం పురపాలక కమిషనర్ మల్లికార్జున రావుకి వినతి పత్రం అందచేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జి. శశి కుమార్ , సీపీఐ పట్టణ కన్వీనర్ సునీల్ , సీపీఐ చిల్లకూరు మండల కార్యదర్శి రమేష్ , ఏ.ఐ.టి. యు.సి జిల్లా అధ్యక్షులు కె.నారాయణ, బి. కె. ఎం. యు నియోజకవర్గ కార్యదర్శి శ్రీనివాసమూర్తి, ఏ.ఐ.ఎస్.ఎఫ్ నాయకులు రిజ్వాన్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *