కాకినాడ, జగ్గంపేట, పున్నమి ప్రతినిధి,సెప్టెంబర్ 2 :
జగ్గంపేట,స్థానిక రావులమ్మ నగర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ లో కరాటే లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ సాధించిన డాక్టర్ తాండ్రోతు వీర వెంకటరమణ ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సాలువతో సత్కరించి శుభాకాంక్షలు తెలియజేసి ఆశీస్సులు అందించారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ 2026 ఏప్రిల్ 26 గిన్నిస్ వరల్డ్ రికార్డ్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగినది అని ఖమ్మం కలెక్టర్ దివాకర్ చేతుల మీదుగా గిన్నిస్ వరల్డ్ రికార్డ్ తీసుకోవడం జరిగినది అదే కాకుండా గౌరవ డాక్టరేట్ 2025 నవంబర్ నెలలో రావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ఆశీస్సులు ఇవ్వడం చాలా ఆనందంగా ఉందని అన్నారు. 1986 నుండి కరాటే మాస్టర్ గా సేవలు అందిస్తూ గవర్నమెంట్ హై స్కూల్ నుండి అన్ని స్కూల్లో నేర్పిస్తూ జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయ స్తాయి కరాటే పోటీలలో కొన్ని వేల మెడల్స్ సాధించే విధంగా ట్రైనింగ్ ఇచ్చియున్నాము2017 నుండి ఇన్చార్జిగా కాకినాడ జిల్లా కోనసీమ ఈస్ట్ గోదావరి జిల్లాలలోగవర్నమెంట్ హైస్కూల్లో ఆడపిల్లలకుసెల్ఫ్ డిఫెన్స్ క్లాసెస్ మాస్టర్ ద్వారా ఇప్పించడం జరుగుచున్నది 2001 నుండి జిమ్ కోచ్ గా పవర్ లిఫ్టింగ్ వెయిట్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ డీ ఫిట్నెస్ జిమ్ నుండి జిల్లా స్థాయి రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు విద్యార్థులను పంపించుచున్నాము 2004 నుండి జూడో ఒలంపిక్ గేమ్ కోచింగ్ ఇస్తూ జిల్లాస్థాయి రాస్తాయి జాతీయస్థాయి పోటీలకు స్టూడెంట్స్ ని ప్రతి సంవత్సరం 100 పైగా జూడో పోటీలకు స్టూడెంట్స్ ని పంపిస్తున్నాం మరి ఎన్నో మెడల్స్ సాధించారు
రాష్ట్రస్థాయి టీం ఛాంపియన్షిప్ ప్రతి సంవత్సరం జూనియర్ సీనియర్లు టీం ఛాంపియన్
మన జిల్లాకు రావడం గర్వకారణం
ఆంధ్ర యూనివర్సిటీ జెఎన్టియు యూనివర్సిటీ
నన్నయ యూనివర్సిటీ జూడో బోర్డు నెంబర్ గా సేవలు అందిస్తున్నాం స్పోర్ట్స్ అథారిటీ ద్వారా డి ఫిట్నెస్ జిమ్ము ద్వారా కరాటి కోచింగ్ ద్వారా ఫిట్నెస్ ద్వారా100 మంది పైగా గవర్నమెంట్ ఉద్యోగాలు మా స్టూడెంట్స్ సాధించారు అంతేకాకుండా నా స్టూడెంట్స్ 28 మంది బ్లాక్ బెల్ట్ నా ద్వారా తీసుకున్నారు 40 సంవత్సరాల నుండి ఉచిత కోచింగ్ గవర్నమెంట్ హై స్కూల్ జగ్గంపేట కరాటి జూడో కోచింగ్ డీ ఫిట్నెస్ జిమ్ నందు వెయిట్ లిఫ్టింగ్ పవర్ లిఫ్టింగ్ బాడీ బిల్డింగ్ కోచింగ్ ఇస్తూ ఉన్నాం అని వెంకటరమణ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ అప్పలరాజు పాల్గొన్నారు.


