ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి)
నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ పాఠశాల చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

మనుబోలులో ఘనంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా సెప్టెంబర్ 2 (పున్నమి ప్రతినిధి) నెల్లూరు జిల్లా మనుబోలు మండల కేంద్రంలో జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక శ్రీ బ్రహ్మేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి పార్టీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం అంగన్వాడీ పాఠశాల చిన్నారులకు స్నాక్స్ పంపిణీ చేశారు. కేక్ కట్ చేసి పవన్ కళ్యాణ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతీకగా మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

