Date. 02.08.2026
దుత్తలూరు (పున్నమి ప్రతినిధి )
ఉదయగిరి: జనసేన పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలను ఉదయగిరిలో జనసేన నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా భారీ కేక్‌ను కట్ చేసి పవన్ కళ్యాణ్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం జనసేన పార్టీ జెండాలు, పవన్ కళ్యాణ్ చిత్రాలతో బైక్ ర్యాలీ నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పార్టీ నాయకులు, యువత, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొని తమ అభిమానాన్ని చాటుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఉదయగిరి నియోజకవర్గ ఇంచార్జి కొట్టె వెంకటేశ్వర్లు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయనతో పాటు వివిధ మండలాల జనసేన మండల కన్వీనర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
పవన్ కళ్యాణ్ ఆశయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమం సందర్భంగా ఉదయగిరిలో జనసేన శ్రేణుల సందడి నెలకొంది.
Uploaded Video:




