వార్త ముఖ్యాంశాలు
- శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 01, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం.
- ఉమేష్ రావు కొనియాడారు.
- మంగళవారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం 18వ వార్డు పరిధిలో నిర్వహించిన 'ఎన్టీఆర్ భరోసా' పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు.
శ్రీ కాళహస్తి, సెప్టెంబర్ 01, (పున్నమి న్యూస్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి, ప్రజల సంక్షేమమే ధ్యేయంగా ఎన్డీయే కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని తెలుగుదేశం పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ ఎం. ఉమేష్ రావు కొనియాడారు. మంగళవారం శ్రీకాళహస్తి పురపాలక సంఘం 18వ వార్డు పరిధిలో నిర్వహించిన ‘ఎన్టీఆర్ భరోసా’ పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పార్టీ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి పాల్గొని లబ్ధిదారులకు పింఛన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఉమేష్ రావు మాట్లాడుతూ, దేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా ఈ నెలలో రాష్ట్రవ్యాప్తంగా 61,92,396 మంది లబ్ధిదారుల కోసం ప్రభుత్వం రూ. 2,693.90 కోట్లను వెచ్చించిందని తెలిపారు. దీనికితోడు ఈ నెల నుండి కొత్తగా 6,268 మందికి స్పౌజ్ పింఛన్లను కూడా పంపిణీ చేస్తూ కూటమి ప్రభుత్వం సంక్షేమానికి సరికొత్త నిర్వచనం ఇస్తోందని హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, సీనియర్ నాయకులు లక్కమనేని మధుబాబు, షేక్ మహబూబ్ బాషా, డి.వి.నారాయణ, సయ్యద్ చాంద్ బాషా, కోట చంద్రశేఖర్, నూర్ మొహమ్మద్, తుపాకుల ప్రసాద్ మరియు సచివాలయ అధికారి ప్రమీల తదితరులు పాల్గొన్నారు.