Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు

అవ్వాతాతల ఆనందమే మా సంతోషం : మంత్రి నారాయణ

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
అవ్వాతాతల ఆనందమే మా సంతోషం : మంత్రి నారాయణ

వార్త ముఖ్యాంశాలు

  • అవ్వాతాతల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు.
  • నెల్లూరు 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో మంగళవారం NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు.
  • కూటమి ప్రభుత్వం 62 లక్షల కుటుంబాల పింఛన్ల కోసం ఏటా ₹33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు ₹73,594.44 కోట్లు కేటాయించిందని తెలిపారు.

అవ్వాతాతల కళ్లలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ అన్నారు. నెల్లూరు 6వ డివిజన్ ఉడ్‌హౌస్ సంఘంలో మంగళవారం NTR భరోసా పింఛన్లను లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. కూటమి ప్రభుత్వం 62 లక్షల కుటుంబాల పింఛన్ల కోసం ఏటా ₹33 వేల కోట్లు ఖర్చు చేస్తోందని, ఇప్పటివరకు ₹73,594.44 కోట్లు కేటాయించిందని తెలిపారు. వృద్ధులు, వితంతువులకు ₹4,000, దివ్యాంగులకు ₹6,000, పూర్తి వికలాంగులకు ₹15,000, కిడ్నీ, కాలేయ వ్యాధిగ్రస్తులకు ₹10,000 అందిస్తున్నట్లు చెప్పారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేష్ కృషితో సంక్షేమం, అభివృద్ధి కొనసాగుతున్నాయన్నారు. కార్యక్రమంలో కమిషనర్ నందన్, మేయర్ దేవరకొండ సుజాత, డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్, తాళ్లపాక అనూరాధ, విజేతా రెడ్డి, కార్పొరేటర్ కిన్నెర మాల్యాద్రి, కొండా ప్రవీణ్, రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *