పున్నమి న్యూస్ ప్రతినిధి (సెప్టెంబర్ 01):
పులివెందుల పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయం సమీపంలో ఉన్న రింగ్ రోడ్డులో మంగళవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో బైక్‌పై వెళ్తున్న మహిళకు గాయాలయ్యాయి. రోడ్డు క్రాస్ చేసే సమయంలో అదుపుతప్పి మహిళ కిందపడిపోయినట్లు సమాచారం.
ప్రమాదంలో గాయపడిన మహిళను స్థానికులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన మహిళకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

