ఖానాపూర్ మండల కేంద్రంలో రెండు బస్టాండ్ సెంటర్లలో టీజీఎస్ ఆర్టీసీ డీలక్స్, ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపాలని కోరుతూ ప్రజావాణి కార్యక్రమంలో ఎంపీడీవో గారికి సర్పంచ్ దాసరి రమేష్ గారు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ. ఖానాపూర్ మండల కేంద్రం నుండి నిత్యం వందలాది మంది ప్రయాణికులు హైదరాబాద్, వరంగల్, నర్సంపేట, మహబూబాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్తుంటారని, అయితే డీలక్స్ మరియు ఎక్స్ ప్రెస్ బస్సులు ఇక్కడ ఆపకపోవడం వల్ల ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. వెంటనే రెండు బస్టాండ్ సెంటర్లలో అన్ని బస్సులు ఆపే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ తక్కలపల్లి రమేష్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వార్డు సభ్యులు అజహర్, గుండ్లపల్లి విజయ్, మాజీ ఉప సర్పంచ్ మేడిద కుమార్ పార్టీ నాయకులు మర్రి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.
