మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రత్యేక నిఘా: ఎస్సై జగదీష్
తిరుమలాయపాలెం: మత్తు పదార్థాల వినియోగం, అక్రమ రవాణాను అరికట్టేందుకు పోలీసులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఎస్సై జగదీష్ ఆధ్వర్యంలో నార్కోటిక్ డాగ్ సహాయంతో విస్తృతంగా తనిఖీలు నిర్వహించారు.
మండలంలోని సుబ్లేడు గ్రామంలోని గ్రానైట్ క్వారీలతో పాటు కాకరవాయి గ్రామంలోని పాఠశాల, దేవాలయ పరిసర ప్రాంతాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనుమానాస్పద ప్రాంతాలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ మత్తు పదార్థాల అక్రమ వినియోగం, సరఫరాపై నిఘా పెట్టారు.
ఈ సందర్భంగా ఎస్సై జగదీష్ మాట్లాడుతూ.. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని, మాదకద్రవ్యాల వినియోగం, విక్రయాలు లేదా సరఫరాకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో మత్తు పదార్థాల ఆనవాళ్లు లేకుండా చేయడమే లక్ష్యంగా నిరంతరం తనిఖీలు కొనసాగిస్తామని తెలిపారు.
ఈ తనిఖీల కార్యక్రమంలో ఎస్సై జగదీష్‌తో పాటు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.
Uploaded Video:




