వార్త ముఖ్యాంశాలు
- ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి మనుబోలు యాక్ట్ రిపోర్టర్ వాకా రమేష్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు.
- మనుబోలు నుంచి తన సొంతూరు రామదాసుకండ్రిగకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
- ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో జర్నలిస్టు వర్గాల్లో విషాదం నెలకొంది.
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి
మనుబోలు యాక్ట్ రిపోర్టర్ వాకా రమేష్ రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందారు. మనుబోలు నుంచి తన సొంతూరు రామదాసుకండ్రిగకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ప్రమాదంలో రమేష్ మృతి చెందడంతో జర్నలిస్టు వర్గాల్లో విషాదం నెలకొంది. ఎప్పుడూ నవ్వుతూ, అందరితో ఆప్యాయంగా ఉండే రమేష్ చిన్న వయస్సులోనే కానరాని లోకాలకు చేరడం తీవ్ర బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేశారు. వార్తల సేకరణలో ఎంతో ఉత్సాహంగా పనిచేసే రమేష్ ఇక మన మధ్య లేకపోవడం జీర్ణించుకోలేని విషయమన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు.