నందలూరు: హైదరాబాద్ నుంచి తిరుమల శ్రీవారి దర్శనం కోసం 22వ మహా పాదయాత్రగా బయలుదేరిన సుమారు 50 మంది స్వాములకు నందలూరుకు చెందిన అమ్మ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం అల్పాహారం ఏర్పాటు చేశారు.
పాదయాత్రలో పాల్గొంటున్న స్వాములకు అల్పాహారం అందించి, వారి యాత్ర విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు. భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషంగా ఉందని ట్రస్ట్ నిర్వాహకులు తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామాక్షి, నాగరాజు, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు. పాదయాత్రికులకు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తూ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తామని వారు తెలిపారు.
Uploaded Video:


