Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
కడప

బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

వార్త ముఖ్యాంశాలు

  • బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం పున్నమి ప్రతినిధి – బద్వేల్: కడప జిల్లా బద్వేల్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం సాగించిన వేట కలకలం రేపింది.
  • కొత్తచెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.
  • అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

బద్వేల్ లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల వేట కలకలం

పున్నమి ప్రతినిధి – బద్వేల్: కడప జిల్లా బద్వేల్ పరిధిలోని లంకమల అభయారణ్యంలో గుప్త నిధుల కోసం సాగించిన వేట కలకలం రేపింది. కొత్తచెరువు గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలో గుప్త నిధుల కోసం కొందరు వ్యక్తులు తవ్వకాలు జరుపుతున్నట్లు సమాచారం అందడంతో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమయ్యారు.

అనుమానాస్పదంగా సంచరిస్తున్న ముగ్గురు వ్యక్తులను అటవీ అధికారులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అధికారులు అక్కడికి చేరుకోవడంతో మరో నలుగురు వ్యక్తులు అడవిలోకి పరారైనట్లు తెలుస్తోంది.

పట్టుబడిన వ్యక్తులు తిరుపతి, సిద్ధవటం, రాయచోటి ప్రాంతాలకు చెందిన వారిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో మూడు బైకులు, ఒక కారును ఫారెస్ట్ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు.

గుప్త నిధుల కోసం లంకమల అభయారణ్యంలోకి అక్రమంగా ప్రవేశించినట్లు గుర్తించిన అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పరారైన వారి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్లు సమాచారం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *