Wednesday, 23 September 2026
  • Home  
  • “కీర్తి రాయునిగూడెంలో కళ్లకు వెలుగు… MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి మరో అడుగు
- ఎన్ టి ఆర్ జిల్లా

“కీర్తి రాయునిగూడెంలో కళ్లకు వెలుగు… MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి మరో అడుగు

*_👁️ “కీర్తి రాయునిగూడెంలో కళ్లకు వెలుగు… MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి మరో అడుగు!”_* 👁️ MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యసేవలు తోడై… గ్రామంలో కొత్త వెలుగులు! కీర్తి రాయునిగూడెం గ్రామంలో MNR ఫౌండేషన్ & శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు. గ్రామ పెద్దలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… MNR ఫౌండేషన్ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తూ విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రజల అవసరాలను గుర్తించి ప్రత్యక్షంగా సేవలు అందించడం MNR ఫౌండేషన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షులు గోపాల స్వామి అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించి, MNR ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు. శంకర కంటి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం గ్రామానికి చేరుకుని సుమారు 80 మంది గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించింది. కంటి సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలపై సూచనలు అందించారు. ఈ సందర్భంగా దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ… తమ గ్రామంలో MNR ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

*_👁️ “కీర్తి రాయునిగూడెంలో కళ్లకు వెలుగు… MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి మరో అడుగు!”_*

👁️ MNR ఫౌండేషన్ సేవా సంకల్పానికి శంకర కంటి ఆసుపత్రి వైద్యసేవలు తోడై… గ్రామంలో కొత్త వెలుగులు!

కీర్తి రాయునిగూడెం గ్రామంలో MNR ఫౌండేషన్ & శంకర కంటి ఆసుపత్రి సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా జరిగింది. గ్రామ ప్రజలకు కంటి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన వారికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహించేందుకు ఈ శిబిరాన్ని ఏర్పాటు చేశారు.

గ్రామ పెద్దలతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లైవ్ స్టాక్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… MNR ఫౌండేషన్ విద్య, వైద్యం, మౌలిక సదుపాయాల కల్పనలో ఈ ప్రాంత ప్రజలకు అండగా నిలుస్తూ విశేషమైన సేవా కార్యక్రమాలు నిర్వహిస్తోందని అన్నారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ప్రజల అవసరాలను గుర్తించి ప్రత్యక్షంగా సేవలు అందించడం MNR ఫౌండేషన్ ప్రత్యేకత అని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమానికి మండల టీడీపీ అధ్యక్షులు గోపాల స్వామి అతిథిగా హాజరై శిబిరాన్ని సందర్శించి, MNR ఫౌండేషన్ నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను అభినందించారు.

శంకర కంటి ఆసుపత్రికి చెందిన వైద్య బృందం గ్రామానికి చేరుకుని సుమారు 80 మంది గ్రామ ప్రజలకు కంటి పరీక్షలు నిర్వహించింది. కంటి సమస్యలను గుర్తించి, అవసరమైన వారికి తదుపరి వైద్య సేవలపై సూచనలు అందించారు.

ఈ సందర్భంగా దొండపాటి విజయ్ కుమార్ మాట్లాడుతూ… తమ గ్రామంలో MNR ఫౌండేషన్ ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించి ప్రజలకు విలువైన వైద్య సేవలు అందించడం పట్ల ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఇలాంటి సేవా కార్యక్రమాలు మరిన్ని నిర్వహించాలని ఆకాంక్షించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.