వార్త ముఖ్యాంశాలు
- *చీరలో మూటగట్టి బైక్‌పై తెచ్చిన ఉన్మాది!* సూళ్లూరుపేట ఆగష్టు 26 సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి, తడ మండలానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది.
- అయితే, గత నాలుగు నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు.
- స్థానిక పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ అనంతరం, రెండు రోజుల క్రితమే వీరిద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు.
*చీరలో మూటగట్టి బైక్‌పై తెచ్చిన ఉన్మాది!*
సూళ్లూరుపేట ఆగష్టు 26
సూళ్లూరుపేట మండలం కోటపోలూరు గ్రామానికి చెందిన శ్రీనివాసులు అనే వ్యక్తికి, తడ మండలానికి చెందిన సంధ్యతో వివాహం జరిగింది. అయితే, గత నాలుగు నెలలుగా వీరిద్దరి మధ్య విభేదాలు రావడంతో దూరంగా ఉంటున్నారు. స్థానిక పెద్దల సమక్షంలో జరిగిన పంచాయితీ అనంతరం, రెండు రోజుల క్రితమే వీరిద్దరూ మళ్లీ కలిసి జీవించడం ప్రారంభించారు. భార్యతో కలిసి జీవించడం ప్రారంభించిన రెండు రోజులకే శ్రీనివాసులు ఈ కిరాతకానికి ఒడిగట్టాడు. గంజాయి మత్తులో ఉన్న శ్రీనివాసులు, రాత్రి సమయంలో పొలాల్లో తన భార్య సంధ్యను తీవ్రంగా చిత్రహింసలు పెట్టి దారుణంగా హత్య చేసిన ఘటన ఈరోజు అనగా బుధవారం ఉదయం వెలుగు లోకి వచ్చింది హత్య చేసిన అనంతరం, నిందితుడు సంధ్య మృతదేహాన్ని ఒక చీరలో మూటగట్టి, తన బైక్‌పై పెట్టుకుని ఇంటికి తీసుకువచ్చాడు. మృతదేహాన్ని ఆ స్థితిలో బైక్‌పై తీసుకురావడం చూసిన గ్రామస్థులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.గ్రామస్థుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.