Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

తాళ్లరేవులో విజయవంతంగా ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
తాళ్లరేవులో విజయవంతంగా ముగిసిన జ్ఞాన జ్యోతి శిక్షణా తరగతులు

వార్త ముఖ్యాంశాలు

  • డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్లరేవులో శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోఆగస్టు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మొదటి విడతగా,ఆగస్టు 22,24,25 తారీఖులలో రెండవ విడతగా సిడిపిఓ వై శ్రీదేవి పర్యవేక్షణలో…
  • ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరేళ్ల లోపు చిన్నారుల్లో మెదడు ఎదుగుదల 85% జరుగుతుంది.
  • కాబట్టి ఈ వయసులో పిల్లలకు శారీరక,మానసిక,భాష, సాంఘిక భావోద్వేగ, సృజనాత్మకత అభివృద్దులను కలిగించే వివిధ కృత్యాలను అంగన్వాడి కార్యకర్తలకు నేర్పించారు.

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం పరిధిలోని మండల కేంద్రమైన తాళ్లరేవులో శ్రీమతి నామన వెంకయ్యమ్మ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోఆగస్టు 11వ తారీఖు నుంచి 13వ తారీఖు వరకు మొదటి విడతగా,ఆగస్టు 22,24,25 తారీఖులలో రెండవ విడతగా సిడిపిఓ వై శ్రీదేవి పర్యవేక్షణలో సాగిన జ్ఞాన జ్యోతి శిక్షణ తరగతులు ఆగస్టు 25వ తారీఖుతో విజయవంతంగా ముగిసాయి. ఈ శిక్షణ యొక్క ముఖ్య ఉద్దేశం ఆరేళ్ల లోపు చిన్నారుల్లో మెదడు ఎదుగుదల 85% జరుగుతుంది. కాబట్టి ఈ వయసులో పిల్లలకు శారీరక,మానసిక,భాష, సాంఘిక భావోద్వేగ, సృజనాత్మకత అభివృద్దులను కలిగించే వివిధ కృత్యాలను అంగన్వాడి కార్యకర్తలకు నేర్పించారు. దీనితోపాటు పిల్లల సంరక్షణ, ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు సమ్మిళిత విద్య, లింగ సమానత మొదలగు విషయాల గురించి కార్యకర్తలు శిక్షణ పొందారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల, కుటుంబ సభ్యుల, సమాజం యొక్క బాధ్యత ఏ విధంగా ఉండాలనే విషయంపై కూడా కార్యకర్తలు శిక్షణ తీసుకున్నారని సిడిపిఓ వై శ్రీదేవి వివరించారు. ఐసిడిఎస్ విస్తరణ అధికారి నాగలక్ష్మి, ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు కాశి రవీంద్ర, వీరేంద్ర,ప్రసాద్ జిల్లా రిసోర్స్ పర్సన్ లుగా వ్యవహరించి కార్యకర్తలకు శిక్షణను ఇచ్చారు. చివరి రోజు శిక్షణ అనంతరం కార్యకర్తలు చేసిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు అందర్నీ ఆకట్టుకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *