వార్త ముఖ్యాంశాలు
- అమలాపురం–ముక్కామల రహదారి మరమ్మత్తు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు.
- గురువారం ఆయన అమలాపురం–ముక్కామల రహదారి పరిధిలోని జరుగుతున్న మరమ్మత్తు పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
- ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో ఎటువంటి లోపాలకు తావు లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు.
అమలాపురం–ముక్కామల రహదారి మరమ్మత్తు పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని స్థానిక ఎమ్మెల్యే శ్రీ గిడ్డి సత్యనారాయణ గారు సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన అమలాపురం–ముక్కామల రహదారి పరిధిలోని జరుగుతున్న మరమ్మత్తు పనులను సంబంధిత శాఖల అధికారులతో కలిసి పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ రహదారి నిర్మాణ పనుల్లో ఎటువంటి లోపాలకు తావు లేకుండా సంబంధిత అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. నిర్మాణ పనుల్లో నాణ్యతా ప్రమాణాలను తప్పనిసరిగా పాటిస్తూ, భవిష్యత్తులో సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. రహదారి పనులపై ఇరిగేషన్, జాతీయ రహదారులు, రోడ్లు–భవనాల శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ప్రస్తుత పనుల పరిస్థితిని సమగ్రంగా పరిశీలించి, చర్యలు తీసుకోవాలి