Monday, 21 September 2026
  • Home  
  • భక్తిశ్రద్ధలతో కాశీవిశ్వేశ్వరాలయంలో ప్రదోష పూజలు
- తిరుపతి

భక్తిశ్రద్ధలతో కాశీవిశ్వేశ్వరాలయంలో ప్రదోష పూజలు

శ్రీ కాళహస్తి, ఆగస్టు 25, (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తీశ్వరస్వామి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయంలో ప్రదోష కాల పూజలు భక్తిశ్రద్ధల నడుమ వైభవంగా నిర్వహించారు. ప్రదోష పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయానికి పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులు శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ వేదపండితులు శాస్త్రోక్త విధానంలో శ్రీ నందీశ్వరస్వామివారికి, శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామివారికి ఏకకాలంలో విశిష్ట ప్రదోష పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారికి పవిత్ర అభిషేకాలు జరిపి, అమ్మవారితో పాటు ప్రదోష నందీశ్వరస్వామివారిని వివిధ రకాల సుగంధభరిత పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ధూప, దీప, నైవేద్య సమర్పణలతో పాటు మహాదీపారాధనను ఘనంగా నిర్వహించారు. పూజల్లో పాల్గొన్న భక్తులు ‘ఓం నమఃశివాయ’ అంటూ శివనామస్మరణ చేయడంతో ఆలయ ప్రాంగణమంతా ఆధ్యాత్మిక వాతావరణంతో మార్మోగింది. భక్తులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి స్వామివారి, అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందారు. ప్రదోష పూజల సందర్భంగా ఆలయంలో నెలకొన్న భక్తిమయ వాతావరణం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.