వార్త ముఖ్యాంశాలు
- నంద్యాల:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల పరిశీలకురాలు పి.
- ప్రశాంతి మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
- పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీప పోలింగ్ కేంద్రం, ఎస్పీజీ మిషన్ ప్రాంగణం, ఎస్పీజీ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ పురోగతి, అందిన దరఖాస్తులు, అభ్యంతరాలు మరియు బిఎల్‌ఓలు (BLO) నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు.
నంద్యాల:ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియలో భాగంగా ఎన్నికల పరిశీలకురాలు పి. ప్రశాంతి మంగళవారం నంద్యాల నియోజకవర్గంలోని పలు పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పట్టణంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల, ఆర్టీసీ బస్టాండ్ సమీప పోలింగ్ కేంద్రం, ఎస్పీజీ మిషన్ ప్రాంగణం, ఎస్పీజీ ఉన్నత పాఠశాలలోని కేంద్రాలను ఆమె సందర్శించారు.ఈ సందర్భంగా ఓటర్ల జాబితా సవరణ పురోగతి, అందిన దరఖాస్తులు, అభ్యంతరాలు మరియు బిఎల్‌ఓలు (BLO) నిర్వహిస్తున్న రికార్డులను తనిఖీ చేశారు. సవరణ ప్రక్రియను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా మరియు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. అర్హులైన ఓటర్లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆర్డీవో విశ్వనాథ్, మున్సిపల్ కమిషనర్ బి. శేషన్న, ఈఆర్‌వో శివప్రసాద్ రెడ్డి, నంద్యాల అర్బన్ తహసీల్దార్ శ్రీనివాసులు మరియు ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.ఓటరు నమోదు, జాబితాలో వివరాల సరిచూపు లేదా సవరణలకు సంబంధించిన మరిన్ని వివరాలు మరియు సేవలకు భారత ఎన్నికల సంఘం ECI Official Website లేదా ఓటర్ల సేవా పోర్టల్ Voters’ Service Portal ను సందర్శించగలరు.