Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
రంగారెడ్డి

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

రాష్ట్రవ్యాప్తంగా ఉప సర్పంచ్‌ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని వెల్లడి

యాచారం, ఆగస్టు 25: ఉప సర్పంచ్‌ల సంఘం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా రంగారెడ్డి జిల్లా, ఇబ్రహీంపట్నం నియోజకవర్గం, యాచారం మండలం కొత్తపల్లి గ్రామ ఉప సర్పంచ్ కాలె అనిత–రమేష్ నియమితులయ్యారు. హైదరాబాద్‌లో జరిగిన కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ లావుడ్య రాములు నాయక్ కాలె అనిత–రమేష్‌ను రాష్ట్ర కార్యదర్శిగా నియమిస్తూ బాధ్యతలు అప్పగించారు.

ఈ సందర్భంగా కాలె అనిత–రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు లావుడ్య రాములు నాయక్‌కు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్రంలోని ఉప సర్పంచ్‌లు ఎదుర్కొంటున్న సమస్యలు, వారి హక్కులు, సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తానని పేర్కొన్నారు.

ఉప సర్పంచ్‌లకు ప్రభుత్వం కల్పించాల్సిన హక్కులు, అధికారాలు, గౌరవం తదితర అంశాలపై సంఘం తరఫున బలంగా పోరాడుతామని తెలిపారు. తెలంగాణలోని అన్ని గ్రామాల ఉప సర్పంచ్‌లను సంఘటితం చేసి, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు కృషి చేస్తానన్నారు.

అలాగే ఉప సర్పంచ్‌ల సంఘాన్ని రాష్ట్రవ్యాప్తంగా మరింత బలోపేతం చేయడంతో పాటు, ఉప సర్పంచ్‌లందరినీ ఒకే వేదికపైకి తీసుకువచ్చి ఐక్యంగా ముందుకు సాగేందుకు తన వంతు కృషి చేస్తానని కాలె అనిత–రమేష్ తెలిపారు.

కాలె అనిత–రమేష్‌కు రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు దక్కడం పట్ల కొత్తపల్లి గ్రామ ప్రజలు, ఉప సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు, అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆమెకు పలువురు హృదయపూర్వక అభినందనలు, శుభాకాంక్షలు తెలిపారు.

ఉప సర్పంచ్‌ల హక్కుల సాధన కోసం ఐక్యంగా ముందుకు సాగుదాం – జై ఉప సర్పంచ్‌లు – జై తెలంగాణ

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

ఉప సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర కార్యదర్శిగా కాలె అనిత–రమేష్

Leave a comment

Your email address will not be published. Required fields are marked *