ఆగస్టు 24, 2026
ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకుని… అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం అన్నారు.

క్రాప్ అలర్టపై పర్యవేక్షణ – సీఎం
ఆగస్టు 24, 2026 ఎల్నినో నేపథ్యంలో రాష్ట్రంలో పంటల పరిస్థితిని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. ఈసారి వ్యవసాయ దిగుబడులు సాధారణం కన్నా 20 శాతం తగ్గే అవకాశం ఉందని తెలిపారు. అదే విధంగా కృష్ణా డెల్టాకు సెప్టెంబర్ నెలాఖరు వరకు పట్టిసీమ ద్వారా గోదావరి జలాలు అందించగలమని చెప్పారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు సమృద్ధిగా నీరందించేలా చూడాలని సీఎం ఆదేశించారు. ఇప్పటికే సాగు మొదలు పెట్టని చోట వరికి బదులుగా ప్రత్యామ్నాయ పంటలు ప్రోత్సహించాలని నిర్దేశించారు. రైతులకు ఎప్పటికప్పుడు క్రాప్ అలర్ట్ పంపడంతో పాటు దానిపై ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అధికారులు పర్యవేక్షించాలన్నారు. ఇందుకోసం ఏపీటీఎస్ అనలిటిక్స్ కూడా వినియోగించుకుని… అవేర్తో సమన్వయం చేసుకోవాలని సీఎం అన్నారు.

