Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
విశాఖపట్నం

గాజువాకలో 29న మెగా జాబ్ మేళా 3 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:
గాజువాకలో 29న మెగా జాబ్ మేళా 3 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

విశాఖ గాజువాక( పున్నమి ప్రతినిధి) :గాజువాక నియోజకవర్గ యువతకు విస్తృతంగా ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఈ నెల 29న భారీ స్థాయిలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు గాజువాక ఎమ్మెల్యే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తెలిపారు.

గాజువాక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో సోమవారం మెగా జాబ్ మేళాకు సంబంధించిన గోడపత్రికను ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జాబ్ మేళాలో 100కు పైగా ప్రముఖ కంపెనీలు పాల్గొంటాయని, వివిధ రంగాల్లో అర్హత కలిగిన యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు. ఈ మేళా ద్వారా 3,000కు పైగా ఆఫర్ లెటర్లు అందించేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు.

ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు ఈ జాబ్ మేళా మంచి అవకాశంగా నిలుస్తుందని అన్నారు. ఆగస్టు 29, శనివారం ఉదయం 9 గంటల నుంచి శ్రీనగర్‌లోని టీఎస్‌ఆర్‌టిబీకే కళాశాల మైదానంలో జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు.

10వ తరగతి, ఇంటర్మీడియట్, డిగ్రీ, డిప్లొమా, ఐటీఐతో పాటు ఇతర విద్యార్హతలు కలిగిన అభ్యర్థులు తమ అర్హతలకు అనుగుణంగా ఉద్యోగ అవకాశాలను పరిశీలించి ఇంటర్వ్యూలకు హాజరు కావాలని పిలుపునిచ్చారు. యువతకు ఉపాధి కల్పించడం, వారి భవిష్యత్తుకు భరోసా కల్పించడమే లక్ష్యంగా నిర్వహిస్తున్న ఈ మెగా జాబ్ మేళాను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధి, నైపుణ్యాభివృద్ధి అధికారులు డి.అరుణ, గోవిందరావు, కమలాకర్, నియోజకవర్గ సమన్వయకర్త ప్రసాదుల శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు గంధం శ్రీనివాస్, పల్లా శ్రీనివాసరావు, రౌతు శ్రీనివాసరావు, రాజాన రామారావు తదితరులు పాల్గొన్నారు.

గాజువాకలో 29న మెగా జాబ్ మేళా 3 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

గాజువాకలో 29న మెగా జాబ్ మేళా 3 వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు.. 100కు పైగా ప్రముఖ కంపెనీల భాగస్వామ్యం

Leave a comment

Your email address will not be published. Required fields are marked *