వార్త ముఖ్యాంశాలు
- సేవా భావమే యువత ఉపాధేయ లక్ష్యం కడప, పున్నమి ప్రతినిధి: సేవా భావంతో యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సర్వమంగళం స్వీట్ సెంటర్ ప్రొప్రైటర్స్ సుబ్బమ్మ, నారాయణ, నరేంద్ర కుమార్ తెలిపారు.
- కడప నగరంలోని కొత్త బస్టాండ్ ఆర్ఎస్ రోడ్డు, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్వమంగళం స్వీట్ సెంటర్‌ను సోమవారం వారు లాంఛనంగా ప్రారంభించారు.
- సాంప్రదాయబద్ధంగా మహిళలు హారతులు పట్టగా, వేద మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి షాపులోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
సేవా భావమే యువత ఉపాధేయ లక్ష్యం
కడప, పున్నమి ప్రతినిధి: సేవా భావంతో యువతకు ఉపాధి కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని సర్వమంగళం స్వీట్ సెంటర్ ప్రొప్రైటర్స్ సుబ్బమ్మ, నారాయణ, నరేంద్ర కుమార్ తెలిపారు.
కడప నగరంలోని కొత్త బస్టాండ్ ఆర్ఎస్ రోడ్డు, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన సర్వమంగళం స్వీట్ సెంటర్‌ను సోమవారం వారు లాంఛనంగా ప్రారంభించారు. సాంప్రదాయబద్ధంగా మహిళలు హారతులు పట్టగా, వేద మంత్రోచ్చారణల మధ్య రిబ్బన్ కట్ చేసి షాపులోకి ప్రవేశించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన వారికి స్వీట్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తమ సర్వమంగళం స్వీట్ సెంటర్లో సరసమైన ధరలకు అన్ని రకాల స్వీట్లు అందుబాటులో ఉంటాయని తెలిపారు. రుచి, శుచి, శుభ్రత, నాణ్యతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని చెప్పారు. స్వీట్ల తయారీలో స్వచ్ఛమైన ఆవుపాలను వినియోగిస్తున్నామని, ప్రత్యేకంగా బెంగాల్ నుంచి నిపుణులైన స్వీట్ తయారీ కార్మికులను తీసుకువచ్చి స్వీట్లు తయారు చేయిస్తున్నామని తెలిపారు.
ప్రత్యేకంగా రుచికరమైన, సువాసనతో కూడిన బెంగాల్ స్వీట్లు తమ వద్ద అందుబాటులో ఉంటాయని పేర్కొన్నారు. అలాగే షుగర్‌లెస్ స్వీట్లు అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. ఇంపోర్టెడ్ చాక్లెట్లు, వివిధ రకాల స్నాక్స్ కూడా అందుబాటులో ఉంటాయని చెప్పారు.
వినాయక చవితి పండుగను పురస్కరించుకుని కస్టమర్ల ఆర్డర్‌కు అనుగుణంగా లడ్డూలను తయారు చేసి అందిస్తామని తెలిపారు. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూకు ఉపయోగించే ఫ్లేవర్స్‌ను వినియోగిస్తూ నాణ్యమైన లడ్డూలను తయారు చేస్తామని చెప్పారు. నాణ్యత విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాజీ పడబోమని స్పష్టం చేశారు.
కస్టమర్లు ఒక్కసారి తమ స్వీట్ సెంటర్‌ను సందర్శించి స్వీట్లను రుచి చూసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. శుభకార్యాలు, వివాహాలు, ఇతర ఫంక్షన్లకు అవసరమైన స్వీట్లు, ఆర్డర్లను డెలివరీ చేస్తామని తెలిపారు. ఆర్డర్ల కోసం 9959257955 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో చంద్రశేఖర్, నరసింహ, లక్ష్మయ్య, గోపాల్, ఎం. రాజశేఖర్‌తో పాటు బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు తదితరులు పాల్గొన్నారు.