సెప్టెంబర్ 17 తేదీన పాదయాత్రకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధం కావాలి
–కట్ల సదానందం టి ఆర్ పి జిల్లా అధ్యక్షులు
——————————-
జనగామ, ఆగష్టు 23,పున్నమి జిల్లా ప్రతినిధి :జిల్లా పార్టీ కార్యాలయం లో నిర్వహించిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం మాట్లాడుతూ,
సభ్యత్వ నమోదు వేగవంతం చేయాలి పార్టీ బలోపేతమే లక్ష్యం
మల్లన్న పాదయాత్ర విజయమే మన సంకల్పంi
ప్రతి కార్యకర్త అడుగు ముందుకు – ప్రతి గ్రామంలో సభ్యత్వం మరియు పార్టీ బలోపితం.
మహిళల చేరికలు… పదవుల అప్పగింత
మండల కమిటీలు గ్రామ కమిటీలు నిర్మాణాత్మకంగా పనిచేయాలి అని కోరారు.
తెలంగాణ రాజ్యాధికార పార్టీ జనగామ జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా నియోజకవర్గ ఇంచార్జ్ డా. కల్నల్ మాచర్ల బిక్షపతి హాజరయ్యారు.
ఈ సందర్భంగా డా. కల్నల్ మాచర్ల బిక్షపతి మాట్లాడుతూ, సెప్టెంబర్ 17న MLC తీన్మార్ మల్లన్న ప్రారంభించనున్న పాదయాత్రకు ప్రతి కార్యకర్త సైనికుడిలా సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. మండలాలు, గ్రామాల్లో పార్టీని మరింత బలోపేతం చేయాలని, సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రతి గడపకు పార్టీ సభ్యత్వాన్ని తీసుకెళ్లాలని సూచించారు.
మహిళలకు బాధ్యతలు – పార్టీకి కొత్త బలం*
జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ జిల్లా మహిళా అధ్యక్షురాలు దండు రాణి ఆధ్వర్యంలో పలువురు మహిళలకు పార్టీ కండువాలు కప్పి తెలంగాణ రాజ్యాధికార పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం వారికి పార్టీ బాధ్యతలు అప్పగించారు.
పార్టీలో చేరిన వారు చింతల కోమలత
మహిళా పట్టణ అధ్యక్షురాలిగా, కొలిపాక మమత బాధ్యతలు అప్పగిస్తూ నియామక పత్రాలు అందజేశారు. అలాగే మంద సరిత జిల్లా మహిళా ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ నియామక పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు కట్ల సదానందం ముదిరాజ్ మాట్లాడుతూ, పార్టీ బలోపేతంలో మహిళలు ముందుండాలి. రాబోయే ఎన్నికల్లో మహిళలకు మొదటి ప్రాధాన్యత ఉంటుంది. మహిళలు రాజకీయంగా ఎదగాలి. ఇంటి పనులకే పరిమితం కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా కీలక పాత్ర పోషించాలి” అని అన్నారు.
మహిళా నాయకత్వాన్ని ప్రోత్సహిస్తూ వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని, ప్రజా సమస్యల పరిష్కారంలో మహిళా నాయకులు చురుకైన పాత్ర పోషించాలని ఆయన కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గడ్డం కృష్ణ, జిల్లా ఉపాధ్యక్షులు రేణుగుంట్ల మురళి బైండ్ల,జిల్లా ప్రధాన కార్యదర్శి మారబోయిన కనకరాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ సీసా శ్రీధర్ గౌడ్, ఇల్లందుల రవీందర్, జిల్లా కార్యదర్శి మంద దిలీప్, జిల్లా యూత్ ఉపాధ్యక్షులు యమంకి విజయ్, జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి చెన్నూరు వంశీ, పట్టణ యూత్ అధ్యక్షులు పానుగంటి కృష్ణ, యూత్ సంయుక్త కార్యదర్శి సల్మాన్ తదితర నాయకులు పాల్గొన్నారు.
