Wednesday, 23 September 2026
  • Home  
  • రాజుగుంటలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు
- తిరుపతి

రాజుగుంటలో ఘనంగా చిరంజీవి జన్మదిన వేడుకలు

చిట్వేలి: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం రాజుగుంటలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల సినీ డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ ప్రముఖులు, మాజీ ఎంపీటీసీ నానబాల నాగార్జున, మాజీ సర్పంచ్ గుత్తి నరసింహులు, జనసేన నాయకులు మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ తదితరుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో 58 మంది అభిమానులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తిరుపతికి చెందిన విజయశ్రీ బ్లడ్‌బ్యాంక్ ప్రతినిధి ఎన్.హరికృష్ణ సహకారంతో రక్తసేకరణ చేపట్టారు. రక్తదాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. రక్తదాతల్లో సేవా స్ఫూర్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 100 మొక్కలను పంపిణీ చేశారు. గుండాలపల్లికి చెందిన పగడాల మణిప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ జరిగింది. రక్తదానం, అన్నదానం, మొక్కల పంపిణీతో చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర, ముక్క సాయి వికాస్‌రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు, యువత హాజరయ్యారు. ప్రతి ఏడాది చిరంజీవి అభిమానులు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

చిట్వేలి: తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలం రాజుగుంటలో మెగాస్టార్ చిరంజీవి 71వ జన్మదిన వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహించారు. రెండు రాష్ట్రాల సినీ డిస్ట్రిబ్యూటర్స్ కమిటీ ప్రముఖులు, మాజీ ఎంపీటీసీ నానబాల నాగార్జున, మాజీ సర్పంచ్ గుత్తి నరసింహులు, జనసేన నాయకులు మాదాసు నరసింహ, మద్దూరి మన్మధ తదితరుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఈ సందర్భంగా నిర్వహించిన భారీ రక్తదాన శిబిరంలో 58 మంది అభిమానులు, యువత స్వచ్ఛందంగా రక్తదానం చేశారు. తిరుపతికి చెందిన విజయశ్రీ బ్లడ్‌బ్యాంక్ ప్రతినిధి ఎన్.హరికృష్ణ సహకారంతో రక్తసేకరణ చేపట్టారు. రక్తదాతలకు నిర్వాహకులు సర్టిఫికెట్లు అందజేశారు. అనంతరం అన్నదానం నిర్వహించారు.
రక్తదాతల్లో సేవా స్ఫూర్తితో పాటు పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించేందుకు 100 మొక్కలను పంపిణీ చేశారు. గుండాలపల్లికి చెందిన పగడాల మణిప్రసాద్ ఆధ్వర్యంలో మొక్కల పంపిణీ జరిగింది. రక్తదానం, అన్నదానం, మొక్కల పంపిణీతో చిరంజీవి జన్మదిన వేడుకలను నిర్వహించడం అభినందనీయమని పలువురు పేర్కొన్నారు.
కార్యక్రమానికి ఎమ్మెల్యే అరవ శ్రీధర్, తాతంశెట్టి నాగేంద్ర, ముక్క సాయి వికాస్‌రెడ్డి, పలువురు టీడీపీ, జనసేన నాయకులు, చిరంజీవి అభిమానులు, యువత హాజరయ్యారు. ప్రతి ఏడాది చిరంజీవి అభిమానులు జన్మదిన వేడుకలను సేవా కార్యక్రమాలతో నిర్వహిస్తూ సామాజిక బాధ్యతను చాటుతున్నారని నిర్వాహకులు తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.