వార్త ముఖ్యాంశాలు
- డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ.
- పోలవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్.
- అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి, ముమ్మిడివరం నియోజకవర్గం సమన్వయకర్త సుoకర పావని, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, పెదమడి రాజేష్, ఇతర కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా…
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఐ. పోలవరం మండల పరిషత్ కార్యాలయం వద్ద శనివారం నిర్వహించిన స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమంలో శాసనసభ విప్ మరియు ముమ్మిడివరం శాసనసభ్యులు దాట్ల సుబ్బరాజు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ గుత్తుల సాయి, ముమ్మిడివరం నియోజకవర్గం సమన్వయకర్త సుoకర పావని, మాజీ శాసనసభ్యులు చెల్లి వివేకానంద, మండల పార్టీ అధ్యక్షులు సాగిరాజు సూరిబాబు రాజు, పెదమడి రాజేష్, ఇతర కూటమి నాయకులు, అభిమానులు, ప్రజలు, అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు మాట్లాడుతూ, పరిశుభ్రమైన పరిసరాలే ఆరోగ్యకరమైన సమాజానికి పునాది అన్నారు. స్వచ్ఛతను కేవలం ప్రభుత్వ కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా భావించి ముందుకు రావాలని పిలుపునిచ్చారు.అనంతరం ప్రజలు, అధికారులు, నాయకులతో కలిసి స్వచ్ఛత ప్రతిజ్ఞ చేయించారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ, స్వచ్ఛమైన గ్రామాలు ఆరోగ్యకరమైన సమాజం లక్ష్యంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ప్రతిజ్ఞ చేయించారు.