మాచర్ల: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో భాగంగా ఆగస్టు 22, 23, 29, 30 తేదీలను ప్రత్యేక ప్రచార దినాలుగా ఎన్నికల కమిషన్ ప్రకటించినట్లు 101-మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎన్నికల నమోదు అధికారి కె. అద్దయ్య తెలిపారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రత్యేక ప్రచార దినాల్లో సంబంధిత బూత్ స్థాయి అధికారులు (BLOలు) తమకు కేటాయించిన పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లకు అందుబాటులో ఉండాలని సూచించారు. ఓటర్ల జాబితాకు సంబంధించిన వివరాలు, అభ్యంతరాలు, మార్పులు, చేర్పులు తదితర అంశాలపై ఓటర్లకు అవసరమైన సమాచారం అందించడంతో పాటు వారి సందేహాలను నివృత్తి చేయాలని BLOలను ఆదేశించారు.
ప్రత్యేక ప్రచార దినాలను ఓటర్లు సద్వినియోగం చేసుకుని ఓటర్ల జాబితాలో తమ పేరు, చిరునామా, ఇతర వివరాలను పరిశీలించుకోవాలని ఎన్నికల నమోదు అధికారి కె. అద్దయ్య కోరారు. వివరాల్లో ఏవైనా తప్పులు, మార్పులు లేదా చేర్పులు అవసరమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.


