యవ్వనానంద సరాగిణి
తృణముకాని త్రికాలమణి
భావవ్యక్తీకరణ సంస్కరిణి
మానవత్వ మధుర భామిని
జాతి చరిత్రరీతి ప్రకాశిని
తరగని సుసంపన్న ధ్వని
అంతరంగ భావతరంగ ఘని
తీరు మారని అనుబంధ ఆమని
జనలోకాభినయ మానసోల్లాస భావసిరి
ఉత్సవశోభతో కదలాడే కమనీయ నేత్రగురి
నోటిబాటలో విహరిస్తున్న హృదయమాధురి
దివ్యమైన ప్రకృతిలో పరవశమైన శ్వాసగ చేరి
ఆత్మీయ అర్థాంశాల సూచకమై
అనురాగపు జీవుల అంతరంగమై
అణువణువున స్పందించు విజ్ఞానజ్ఞాపకమై
సాక్షాత్ ప్రకృతి సంగీత స్వరూపమైన భాష
నా మాతృభాష
విజ్ఞాన వినోదాల అభిలాష
స్పందన అభినందనల జిజ్ఞాస
వాగ్దేవి సత్సంకల్ప జీవనాధార శ్వాస

