Contact Us Latest News
నిజమైన వార్త. వేగమైన సమాచారం. ఆంధ్రప్రదేశ్ • తెలంగాణ • జాతీయం
Author Panel
BHADRADRI

G.O. 97 రద్దు చేయాలని(AISF) సభ్యులు మరియు పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నా/ఆందోళన కార్యక్రమం.

పున్నమి న్యూస్‌రూమ్ ప్రచురణ:

భద్రాద్రి కొత్తగూడెం:-పున్నమి వార్తలు పాల్వాంచ 21/08/2026
(G.O. 97) రద్దు: పాలిటెక్నిక్, సాంకేతిక విద్యా వ్యవస్థను దెబ్బతీసే జీవో నం. 97 ను తక్షణమే రద్దు చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి.
స్కిల్ యూనివర్సిటీలో విలీనంపై అభ్యంతరం: పాలిటెక్నిక్ కళాశాలలను “యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ”తో అనుసంధానం చేయడం/విలీనం చేయడం వల్ల విద్యార్థుల భవిష్యత్తు దెబ్బతింటుందని, ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు.
ECET మరియు లాటరల్ ఎంట్రీ ప్రమాదం: పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ వర్సిటీకి కేటాయిస్తే విద్యార్థులు ఈసెట్ (ECET) రాసి బి.టెక్ (B.Tech) లాటరల్ ఎంట్రీ ద్వారా పైచదువులు చదివే అవకాశాన్ని కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రైవేటీకరణ ఆలోచన వెనక్కి తీసుకోవాలి: శక్తి పాలసీ/ప్రైవేటీకరణ ప్రయత్నాలను నిలిపివేసి, 1957 నుండి సేవలందిస్తున్న పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను కాపాడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ అధికారులకు ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు
డాన్ కొరిమి సంజయ్ కొరిమి
వినతిపత్రం అందజేశారు.

G.O. 97 రద్దు చేయాలని(AISF) సభ్యులు మరియు పాలిటెక్నిక్ విద్యార్థులు చేపట్టిన ధర్నా/ఆందోళన కార్యక్రమం.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *