ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి)
మనుబోలు మండలంలోని గూడూరు నుంచి మనుబోలు వైపు వెళ్లే మార్గంలో హైవేపై లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని భారీగా డ్యామేజ్ అయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

హైవేపై లారీ ఢీ.. తప్పిన పెను ప్రమాదం
ఎస్పీ ఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 19 (పున్నమి ప్రతినిధి) మనుబోలు మండలంలోని గూడూరు నుంచి మనుబోలు వైపు వెళ్లే మార్గంలో హైవేపై లారీ, కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతిని భారీగా డ్యామేజ్ అయింది. అయితే కారులో ప్రయాణిస్తున్న వారికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు అక్కడికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు. ఈ ఘటనతో కొద్దిసేపు హైవేపై వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ప్రమాదానికి గల కారణాలపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

