కడప నగరం చలమారెడ్డిపల్లిలోని కైలాసపురంలో వెలసిన శ్రీ భువనేశ్వరి దేవీ మాత ఆలయ పునఃప్రారంభ మహోత్సవం ఈ నెల 21న ఘనంగా నిర్వహించనున్నట్లు జై మాతా భువనేశ్వరి కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమానికి ఒంటిమిట్ట పోతన సాహిత్య పీఠం అధ్యక్షులు డాక్టర్ పసుపులేటి శంకర్‌ను విశిష్ట అతిథిగా ఆహ్వానించారు.
అలాగే బ్రహ్మంగారి మఠం తోట్లపల్లిలోని ఆచలానంద ఆశ్రమ అధిపతి శ్రీ విరజానందస్వామి, మృత్యుంజయేశ్వర సర్వమంగళ పీఠం వ్యవస్థాపకులు రామకృష్ణ కవి విశిష్ట అతిథులుగా పాల్గొననున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
నూతనంగా నిర్మించిన ఆలయ గోపుర శిఖర కలశ ప్రతిష్ఠాపనలో భాగంగా శుక్రవారం ఉదయం నుంచి కళాశారాధన, యాగశాల పూజలు, పూర్వ ప్రోక్షణ, ఆవాహనాది కార్యక్రమాలు, కుంభాభిషేకం, విశేష పూజలు నిర్వహించనున్నారు. అనంతరం దివ్య మంగళహారతి, అన్నప్రసాద వితరణ కార్యక్రమాలు ఉంటాయని కమిటీ సభ్యులు వెల్లడించారు.




