పున్నమి: రంగారెడ్డి జిల్లా: కర్మన్ ఘాట్ బైరమాలగూడ దుర్గా నగర్ కాలనీలో కొలువై ఉన్న శ్రీశ్రీశ్రీ నల్ల పోచమ్మ తల్లి బోనాల పండుగ ను ఆదివారం ఘనంగా నిర్వహించారు. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊరేగింపుగా ఆలయాలకు చేరుకొని అమ్మవారికి బోనాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ చీర శ్రీనివాస్ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రత్యేకంగా నిలిచే బోనాల పండుగను నగర వ్యాప్తంగా నిర్వహిస్తున్నారని, మహిళలు సంప్రదాయ దుస్తులు ధరించి బోనాలు అలంకరించి అమ్మవారికి సమర్పించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు ఇమ్మిడి శ్రీశైలం, ఇమ్మిడి రాములు, బెజవాడ గణేష్, చీర శ్రీనివాస్,సుకుమార్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.



