ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించడమే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేయాలని ఖమ్మం అర్బన్ డీసీసీ అధ్యక్షులు నాగండ్ల దీపక్ చౌదరి పిలుపునిచ్చారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో తుంబూరు దయాకర్ రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో పాలేరు 1, 59, 60 డివిజన్ల అధ్యక్ష, కార్యదర్శుల ఎంపికపై చర్చించారు. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. బూత్ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసి కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని ఆకాంక్షించారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.



