నంద్యాల : పద్మావతి నగర్‌లోని సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో మూడు రోజులుగా నిర్వహించిన ఉచిత వైద్య శిబిరం విజయవంతంగా ముగిసింది. శిబిరంలో సుమారు 200 మంది శిశువులు, చిన్నారులకు వైద్య పరీక్షలు నిర్వహించి వినికిడి పరీక్షలు, పుట్టుకతో వచ్చే గుండె జబ్బుల స్క్రీనింగ్‌ను ఉచితంగా చేశారు.ఈ సందర్భంగా నవజాత శిశువులు, చిన్నారుల అత్యవసర చికిత్స కోసం రూపొందించిన అత్యాధునిక అంబులెన్స్‌ను డాక్టర్ రవి కృష్ణ, డాక్టర్ మధుసూదనరావు ప్రారంభించారు. అంబులెన్స్‌లో ట్రాన్స్పోర్ట్ వెంటిలేటర్ సదుపాయం ఏర్పాటు చేసినట్లు వైద్యులు తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు, ఆసుపత్రి డైరెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు.

సూర్యన్ చిన్నపిల్లల ఆసుపత్రిలో అత్యాధునిక అంబులెన్స్ ప్రారంభం