80వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా రాజంపేటలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఉచిత రక్తదాన శిబిరం :
ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.రాజంపేట సబ్ ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు.
రాజంపేట, ఆగస్టు 15, 2026: 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్ఎఫ్ఐ రాజంపేట మండల కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 16 న ఉచిత రక్తదాన శిబిరాన్ని ఘనంగా నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవాన్ని కేవలం వేడుకలకు మాత్రమే పరిమితం చేయకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించాలనే ఉద్దేశంతో ఈ రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జాల సుమంత్, వీరపోగు రవి.నాయకులు తెలిపారు.
ఈ కార్యక్రమానికి ఎస్ఎఫ్ఐ కడప జిల్లా అధ్యక్షులు జాల సుమంత్, జిల్లా కార్యదర్శి వీరపోగు రవి, రాజంపేట సబ్-ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు ముఖ్య అతిథులుగా ఆదివారం హాజరై రక్తదాతలను అభినందించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…
రక్తదానం ఎంతో గొప్ప సామాజిక సేవ అని, ప్రమాదాలు, అత్యవసర వైద్య పరిస్థితులు, శస్త్రచికిత్సలు వంటి సందర్భాల్లో రక్తం అవసరమైన వారికి రక్తదాతలు అందించే సహాయం ఎంతో విలువైనదని పేర్కొన్నారు.
విద్యార్థి ఉద్యమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా ఎస్ఎఫ్ఐ ముందుండి పనిచేస్తుందని నాయకులు తెలిపారు. విద్యార్థులు చదువుతో పాటు సమాజం పట్ల బాధ్యత, సేవా భావం, మానవతా విలువలను పెంపొందించుకోవాలని పిలుపునిచ్చారు. యువతలో రక్తదానంపై అవగాహన కల్పించడంతో పాటు, అవసరమైన సమయంలో రక్తం అందుబాటులో ఉండేలా ఇటువంటి శిబిరాలను మరింత విస్తృతంగా నిర్వహించాల్సిన అవసరం ఉందని అన్నారు.
స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ, సమాజంలోని ప్రతి ఒక్కరి సంక్షేమం కోసం యువత ముందుకు రావాలని వారు కోరారు. “రక్తదానం – ప్రాణదానం” అనే స్ఫూర్తితో యువత పెద్ద సంఖ్యలో రక్తదాన కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ రక్తదాన శిబిరంలో విద్యార్థులు, యువత, ఎస్ఎఫ్ఐ నాయకులు, కార్యకర్తలు మరియు స్థానికులు ఉత్సాహంగా పాల్గొని రక్తదానం చేశారు. రక్తదానం చేసిన ప్రతి ఒక్కరికీ ఎస్ఎఫ్ఐ నాయకులు కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన వైద్య సిబ్బంది, రక్తదాతలు, విద్యార్థులు, యువత మరియు స్థానిక ప్రజలకు ఎస్ఎఫ్ఐ రాజంపేట మండల కమిటీ ప్రత్యేక ధన్యవాదాలు తెపిపారు.
ఈ కార్యక్రమంలో రాజంపేట ఎస్ఎఫ్ఐ మండల నాయకులు స్విద్దిక్, ఖాయిఫ, అజెమ్, నవీద్, రూపేష్, చిన్ను, గణేష్, సతీష్. ఇతరులు పాల్గొన్నారు.



