ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి)
సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ పనుల్లో అక్రమ బిల్లులు, గ్రావెల్, ఇసుక, మట్టి, క్వార్ట్జ్ తరలింపుతో ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. లేఅవుట్లకు ఎకరాకు రూ.4 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణలు నిరూపించేందుకు సీబీఐ విచారణకు సిద్ధమని తెలిపారు. సర్వేపల్లి అభివృద్ధి, అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు, కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణానికి సిద్ధమని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం జంగాలపల్లిలో వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

సర్వేపల్లిని దోచేస్తున్న సోమిరెడ్డి కుటుంబం: కాకాణి
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఆగస్టు 16 ( పున్నమి ప్రతినిధి) సర్వేపల్లి నియోజకవర్గంలో సోమిరెడ్డి, ఆయన కుమారుడు, అల్లుడు అవినీతికి పాల్పడుతున్నారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి ఆరోపించారు. వెంకటాచలంలో పర్యటించిన ఆయన మాట్లాడుతూ ఇరిగేషన్ పనుల్లో అక్రమ బిల్లులు, గ్రావెల్, ఇసుక, మట్టి, క్వార్ట్జ్ తరలింపుతో ప్రజా సొమ్ము దోచుకుంటున్నారని విమర్శించారు. లేఅవుట్లకు ఎకరాకు రూ.4 లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. తన ఆరోపణలు నిరూపించేందుకు సీబీఐ విచారణకు సిద్ధమని తెలిపారు. సర్వేపల్లి అభివృద్ధి, అవినీతి అంశాలపై బహిరంగ చర్చకు, కాణిపాకం వినాయకుడి వద్ద ప్రమాణానికి సిద్ధమని సోమిరెడ్డికి సవాల్ విసిరారు. అనంతరం జంగాలపల్లిలో వివాహ వేడుకకు హాజరై నూతన దంపతులను ఆశీర్వదించారు.

