భారత రాజకీయాల్లో విలువలు, సిద్ధాంతాలు, ప్రజాసేవకు నూతన నిర్వచనం ఇచ్చిన మహనీయుడు, భారత మాజీ ప్రధానమంత్రి, భారతీయ జనతా పార్టీ అగ్రనేత శ్రీ అటల్ బిహారీ వాజ్పేయి గారి వర్ధంతి సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాజ్పేయి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి, ఆయన దేశానికి అందించిన సేవలను స్మరించుకున్నారు. ప్రజాస్వామ్య విలువలు, జాతీయ సమైక్యత, సుపరిపాలన కోసం వాజ్పేయి చేసిన కృషి చిరస్మరణీయమని నాయకులు పేర్కొన్నారు. ఆయన చూపిన సిద్ధాంత బాటలో పార్టీ శ్రేణులు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధి, ప్రజాసేవ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత నేటి తరానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు మండధపు సుబ్బారావు, వల్లభనేని పుల్లారావ్, వేల్పుల సుధాకర్, మేకల నాగేంద్ర, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఆర్.వి.యస్. యాదవ్, నక్క రవి గౌడ్, రుద్రగాని మాధవ తదితరులు పాల్గొని వాజ్పేయికి ఘన నివాళులు అర్పించారు

విలువల రాజకీయాలకు నిలువెత్తు నిదర్శనం వాజ్పేయి. వర్ధంతి సందర్భంగా బీజేపీ ఖమ్మం జిల్లా కార్యాలయంలో ఘన నివాళులు