దున్నపోతుల వాగులో విష ప్రయోగం ఆరోపణలు
ఉదయగిరి మండలం కుర్రపల్లి దున్నపోతుల వాగులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాగులోని నీటిలో విషపదార్థాలు కలిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాగు నీటిని వినియోగించే ప్రజలు, పశువుల విషయంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాగు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. విష ప్రయోగం నిజమైతే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

దున్నపోతుల వాగులో విష ప్రయోగం ఆరోపణలు
దున్నపోతుల వాగులో విష ప్రయోగం ఆరోపణలు ఉదయగిరి మండలం కుర్రపల్లి దున్నపోతుల వాగులో గుర్తు తెలియని వ్యక్తులు విష ప్రయోగం చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. వాగులోని నీటిలో విషపదార్థాలు కలిపినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీంతో వాగు నీటిని వినియోగించే ప్రజలు, పశువుల విషయంలో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. ఘటనపై సంబంధిత అధికారులు వెంటనే స్పందించి వాగు నీటి నమూనాలను సేకరించి పరీక్షలు నిర్వహించాలని కోరుతున్నారు. విష ప్రయోగం నిజమైతే బాధ్యులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు.

