కొవ్వూరు పున్నమి న్యూస్ ప్రతినిధి
తూర్పు గోదావరి జిల్లా కొవ్వూరు మండలం లోని కుమారదేవం గ్రామంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని సచివాలయం వద్ద అధికారులు, ప్రజా ప్రతినిధులు,ప్రజలు, యువత, విద్యార్థులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించి జాతీయ గీతాన్ని ఆలపించారు.
అనంతరం స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారి సేవలను కొనియాడారు. దేశభక్తి, ఐకమత్యం, సేవాభావంతో ప్రతి ఒక్కరూ దేశ అభివృద్ధికి తమ వంతు కృషి చేయాలని వక్తలు పిలుపునిచ్చారు.
వేడుకల్లో గ్రామ పెద్దలు, ప్రజాప్రతినిధులు, యువత, మహిళలు, విద్యార్థులు, స్థానికులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. గ్రామమంతా జాతీయ జెండాలతో సందడిగా మారి దేశభక్తి వాతావరణం నెలకొంది.


