ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయాన్ని కాపాడుకోవాలి
పున్నమి ప్రతినిధి – కడప
కడప నగరంలోని సీపీఐ(ఎం) జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి జి. చంద్రశేఖర్ జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ యూనిట్ల ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయాల్లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్నట్లు తెలిపారు. ప్రజాస్వామ్యం, లౌకికవాదం, సామాజిక న్యాయం, సమానత్వం వంటి ఉన్నత విలువలను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ విలువలను దెబ్బతీయాలని చూసే శక్తులకు వ్యతిరేకంగా ప్రజల ఐక్యత, సంఘీభావాన్ని మరింత బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఏ. రామ్మోహన్, బి. మనోహర్, వి. అన్వేష్, జిల్లా కమిటీ సభ్యులు బి. దస్తగిరి రెడ్డి, కే. శ్రీనివాస్ రెడ్డి, కడప నగర కమిటీ సభ్యులు చంద్రారెడ్డి, కేవీపీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి. రఘు, బి. జకరయ్య, కడప నగర కార్యదర్శి డి. నరసింహ, పెన్షన్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రామకృష్ణారెడ్డి తదితర సీపీఐ(ఎం) జిల్లా నాయకులు, కడప నగర కార్యకర్తలు పాల్గొన్నారు.


