విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ ప్రజలకు మెరుగైన సేవలు అందించిన ఆత్మకూరు ప్రాంతానికి చెందిన నలుగురు అధికారులు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవా అవార్డులు అందుకుని సత్తా చాటారు. ఆత్మకూరు ఆర్డీవో బి. పావని, ఆత్మకూరు సీఐ గంగాధర్, ఏఎస్‌పేట ఎస్సై జిలాని, ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి ఉత్తమ అధికారులుగా అవార్డులకు ఎంపికయ్యారు.నెల్లూరులో నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ చేతుల మీదుగా ఆత్మకూరు ఆర్డీవో బి. పావని ఉత్తమ ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. విధి నిర్వహణలో సమర్థవంతంగా వ్యవహరిస్తూ ప్రజల సమస్యలను త్వరితగతిన పరిష్కరించడంలో ఆమె చూపిన చొరవకు ఈ గుర్తింపు లభించింది. ఏఎస్‌పేట ఎస్సై జిలాని విధి నిర్వహణలో ప్రతిభ కనబరుస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్నారు. ఆత్మకూరు సర్కిల్ పరిధిలో విధుల్లో చేరిన తర్వాత వరుసగా మూడోసారి ఉత్తమ అధికారిగా అవార్డుకు ఎంపిక కావడంతో హ్యాట్రిక్ సాధించారు. అలాగే ఆత్మకూరు సీఐ గంగాధర్ కు కూడా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా విశిష్ట సేవా అవార్డు లభించింది. విధి నిర్వహణలో ప్రతిభ కనబరచడంతో పాటు నేరాల నియంత్రణ, పలు క్లిష్టమైన కేసుల పరిష్కారంలో కీలక పాత్ర పోషించినందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఆత్మకూరు సర్కిల్‌లో విధులు నిర్వహిస్తున్న సమయంలో ఇప్పటికే రెండు అవార్డులు అందుకున్న గంగాధర్, మూడో అవార్డుతో హ్యాట్రిక్ సాధించారు.మరోవైపు ఆత్మకూరు తహసీల్దార్ పద్మజ కుమారి కూడా విధి నిర్వహణలో విశిష్ట సేవలు అందిస్తూ ప్రజల మన్ననలు పొందారు. రెవెన్యూ సమస్యల పరిష్కారంలో చురుగ్గా వ్యవహరిస్తూ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకున్న ఆమెను ఉత్తమ అధికారిగా ఎంపిక చేసి విశిష్ట సేవా అవార్డుతో సత్కరించారు.ఒకే ప్రాంతానికి చెందిన నలుగురు అధికారులు ఉత్తమ సేవా అవార్డులు అందుకోవడం పట్ల ఆత్మకూరు ప్రాంత ప్రజలు, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది హర్షం వ్యక్తం చేస్తూ వారికి అభినందనలు తెలిపారు.

ఉత్తమ అధికారులుగా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన నలుగురికి అవార్డులు